బస్టాండ్‌లో బోల్తా కొట్టిన భద్రత..

బస్టాండ్‌లో బోల్తా కొట్టిన భద్రత..
- గంటలోనే ముగ్గురి మొబైల్స్ గల్లంతు!.
నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఉదయం వరుసగా మూడు మొబైల్ ఫోన్లు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య బస్టాండ్‌కు చేరుకున్న ముగ్గురు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లు మాయమైనట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాధితుల్లో ఓ ఉపాధ్యాయుడు తన ఫోన్‌లో కీలక సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేయగా, మరో రైతు బస్సు ఎక్కే సమయంలో ఫోన్ పోయిందని తెలిపాడు. ఘటనపై కొందరు ప్రయాణికులు పోలీసుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి, బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
