ప్రజాహితమే కూటమి ప్రభుత్వ అభిమతం..

ప్రజాహితమే కూటమి ప్రభుత్వ అభిమతం..

ప్రజాదర్బార్ తో ప్రజల వద్దకు పాలన
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ప్రజాహితమే మన హితం ప్రభుత్వ అభిమతం అని, ఇదే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజాదర్బార్ తో ప్రజల వద్దకు పాలన సాకారం అవుతోందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా విని, వాటికి సంబంధించిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.

హౌసింగ్, రెవెన్యూతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం. జనహితమే మనహితం అన్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ‘ప్రజాదర్బారు’తో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply