కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇంధన సంక్షోభం…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇంధన సంక్షోభం…
కృతిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పెట్రోల్ బంకుల యజమానులు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో గత 5 రోజులుగా పెట్రోల్, డీజిల్ సరైన సమయంలో దొరకపోవడం వల్ల తీవ్రమైన సంక్షోభం గా మారిందనీ వాహనదారు లు గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారనీ వెంటనే ఈ ఇంధన కొరత సమస్య పరిష్కారానికి డబుల్ ఇంజన్ సర్కార్ కృషి చేయకపోతే ప్రజాగ్రహం తప్పదని సిపిఐ నాయకులు ఎస్.బాబా ఫక్రుద్దీన్, ప్రసాద్,సోమన్న లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పట్టణంలోని పెట్రోల్ డీజిల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేదాన్ని నిరసిస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం “డబుల్ ఇంజన్” పేరుతో పరిపాలన గొప్పగా చెబుతుంటే, నేలమీద ప్రజలు ఇంధనం కోసం క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడటం వారి వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందనీ గతంలో నోట్ల రద్దు సమయంలో కూడా ప్రజలు ఇలాగే క్యూ నిలబడి ఇబ్బందులకు గురై మరి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలఇంధన అవసరాలను తీర్చేందుకు పెట్రో బంకుల వద్ద క్యూలు నిలబడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర జిల్లా రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పోలీస్, విజిలెన్స్ శాఖలు చిత్తశుద్ధితో సమన్వయంతో పనిచేయాలన్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించి, అవసరమైనంత నిల్వలు కల్పించాలనీ, కృత్రిమ కొరతలకు కారణమైన అధికారులపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలపై వెంటనే ప్రత్యేక దాడులు నిర్వహించాలనీకోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు. హుస్సేన్ భాష. దానం.నాగార్జున. సాల మద్దిలేటి. మద్దయ్య . ఖలీల్ నబిసా. మున్నా. రంగయ్య. దస్తగిరి రమణ. పెద్ద రంగయ్య.తదితరులు పాల్గొన్నారు.
