నిర్ణీత సమయానికి రీ సర్వే పూర్తి చేయాలి

నిర్ణీత సమయానికి రీ సర్వే పూర్తి చేయాలి

  • జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం. నవీన్

గన్నవరం. ఆంధ్రప్రభ: మండలంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం మండలంలోని గన్నవరం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పొలాలు, ఇళ్ల స్థలాలకు జరుగుతున్న రీ సర్వే పురోగతిపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ప్రక్రియలో భాగమైన గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్, వెక్టరైజేషన్ దశల ప్రగతి అదేవిధంగా, రైతుల ఈ-కేవైసీపై ఆరా తీశారు.

Leave a Reply