అగ్నిప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

అగ్నిప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
విజయవాడ, ఆంధ్రప్రభ: వేసవి తీవ్రత దృష్ట్యా నగరంలోని ఎగ్జిబిషన్ ప్రాంగణాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం బాబూరి గ్రౌండ్స్, భవానిపురంలోని ఎగ్జిబిషన్లను ఫైర్ టీమ్ తనిఖీ చేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంగణం చుట్టూ ఉన్న ఎండు గడ్డిని వెంటనే తొలగించాలని, ప్రతి స్టాల్ వద్ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, నీటి డ్రమ్ములు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. స్టాళ్ల లోపల వంటలు చేయరాదని, అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజన్లు రావడానికి వీలుగా విశాలమైన దారులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పాటించని స్టాళ్లకు అనుమతులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
