చిట్యాలలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు..

చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని సర్పంచ్ తౌటం లక్ష్మి- అంతయ్య అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఒక వినూత్నమైన రీతిలో స్టీల్ బ్యాంకు ఏర్పాటుకు తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిత్యం శుభ , అశుభ కార్యక్రమాలుజరుగుతున్నాయి. ఫంక్షన్స్ లో ప్లాస్టిక్ డిస్పాసాబుల్ ప్లేట్స్ ప్లాస్టిక్ వాటర్ గ్లాస్సెస్ వాడడం జరుగుతుంది. దీని ద్వారా పేపర్ ప్లేట్స్ మీద వాడే మైక్రో ప్లాస్టిక్ కవర్ ద్వారా ప్రజలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల శాస్త్రజ్ఞులు గుర్తించారు.
కావున వీటికి బదులు స్టీల్ ప్లేట్స్ , స్టీల్ వాటర్ గ్లాస్ వాడడం ద్వారా క్యాన్సర్ మహమ్మారిని నివారిస్తూ పర్యావరణాన్ని రక్షించడంలో కీలక పాత్ర వహిస్తూ,మిగితా గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తామని ఆలోచన చేసి తీర్మానం చేయడం జరిగింది. ఇట్టి స్టీల్ బ్యాంకు ఏర్పాటుకు త్వరలోనే పర్యావరణ ప్రేమికుడు , చిట్యాల గ్రామ వాస్తవ్యుడు ముప్పిడోజు నరేంద్రాచారి 1000 స్టీల్ ప్లేట్స్ 800 స్టీల్ వాటర్ గ్లాస్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా వారికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవకాశాన్ని కచ్చితంగా గ్రామ ప్రజలు వాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ భాగస్వాములు కావాలని సర్పంచ్ లక్ష్మి కోరారు.ఇట్టి స్టీల్ బ్యాంకు త్వరలోనే ఒక ప్రకటన ద్వారా అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ , వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి ,గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
