నగరంలో పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

నగరంలో పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 7 మరియు 9వ డివిజన్ లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పంపిణీ చేశారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పింఛన్లు పంపిణీ అనంతరం అవే డివిజన్లోని పలు ప్రాంతాలకు వెళ్లి చెత్త సేకరణకు ప్రతిరోజు వస్తున్నారా లేదా డ్రైనేజీ పొడుగు తీస్తున్నారా లేదా అని పారిశుధ్య నిర్వహణ పై అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
