ఏం జరిగింది..? ఎలా జరిగింది..?
కొత్తూరు : అక్టోబర్ 30: (ఆంధ్రప్రభ): ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (Andhra-Odisha border) ప్రాంతం మండలంలోని కడుమ గ్రామ సచివాలయంలో ఎఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న ఆర్ మాలతీ బాయ్(48) గురువారం ఉదయం 9:00 గం లకు విధి నిర్వహణకు కడుమ గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదానికి సంభందించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరు (Kothur) మండలం కడుమ గ్రామ సచివాలయం ఎ ఎన్ ఎం గా విధులు నిర్వహిస్తున్న ఆర్ మాలతి బాయ్ ప్రతి రోజు మాదిరిగానే ఈ ఉదయం ఒడిశాలోని కాశీనగర్ నుండి స్కూటీ పై కడుమ గ్రామ సచివాలయంకి వస్తుండగా మార్గమథ్యంలో చిన్న మలుపు వద్ద స్కూటీ సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురైంది.
ఈ ప్రమాదంలో ఎఎన్ఎం మాలతీ బాయ్ ఒక్కసారి రోడ్డుకి తల భాగం తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎఎన్ఎం ఆర్ మాలతీ భాయ్ ఒడిస్సా రాష్ట్రం కాశీ నగర్ లో నివాసం ఉంటూ, ప్రతి రోజు డ్యూటీకి స్కూటీ పై వస్తూ ఉంటారు. తన స్కూటీ పై డ్యూటీ నిమిత్తం కడుమ గ్రామ సచివాలయానికి వస్తున్నప్పుడు గ్రామం సమీపంలోనే సెల్ఫ్ ఆక్సిడెంట్ లో తలకు బలమైన గాయం అవ్వడంతో ప్రమాదం స్థలములోనే మృతి చెందింది. కొత్తూరు పోలీసులు సంఘటన స్థలంకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

