Anilravipudi | వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ఫిక్స్..?
Anilravipudi | వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ఫిక్స్..?
Anilravipudi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రస్తుత దర్శకుల్లో అనిల్ రావిపూడి రూటే సపరేటు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూనే.. ఫ్యామిలీ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. దాదాపు ప్రతి సంక్రాంతి పండక్కి సినిమా విడుదల చేయడమే కాకుండా సూపర్ హిట్ కొట్టడం ఆయన ప్రత్యేకత. ఇప్పటి వరకు ఫ్లాప్స్ లేని దర్శకుడిగా అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. సినిమాలు తీయడంలోనే కాదు.. ప్రమోషన్లలో కూడా అనిల్ తనదైనా మార్క్ చూపిస్తారు. సినిమా కాస్టింగ్ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దాంట్లో ఇది ‘అనిల్ రావిపూడి మూవీ’ అని గుర్తు చేసేలా మలుస్తారు ఆయన.
ఇక ప్రమోషన్లు, పబ్లిసిటీలో అనిల్ అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు.. అగ్ర హీరోలను వింటేజ్ వైబ్‌తో, ఎనర్జీతో ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తారు. ఫన్నీ కాన్సెప్ట్‌లతో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ఆయన తర్వాతే ఎవరైనా… ఇక సినిమా టైటిల్ విషయంలో అనిల్ ఎంచుకునే విధానం కొత్తగా ఉంటుంది. ఆయన గత సినిమాలను గమనిస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్’ లాంటి చిత్రాలే దీనికి నిదర్శనం.
ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేశ్ – కల్యాణ్ రామ్‌లతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ జూన్ 18న పూజా కార్యక్రమాలు జరుపుకొని షూటింగ్ ప్రారంభానికి సిద్ధం కానుంది. అయితే ఈ సినిమాకు కూడా అనిల్ తన మార్క్ టైటిల్‌నే ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమాను 2027 సంక్రాంతి టార్గట్ గా జనవరి 13నే విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నట్లే అన్నమాట..!
