500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల వెలువడిన టెన్త్ క్లాస్ పరీక్షల్లో 500 పైగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ హాజరై పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు శాలువా పూలమాల ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, పట్టుదలతో చదివి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించడం చాలా గొప్ప విషయం ఇలాగే ఉన్నంత లక్ష్యంగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు గ్రామానికి ముందు ముందు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థుల చదువుకు కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయురాలు కళావతి, ఉపాధ్యాయ బృందం,గ్రామ పాలకవర్గం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
