నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పవర్‌పుల్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ‘అఖండ 2: తాండవం’ టీజర్ అధికారికంగా విడుదలైంది. దర్శకుడు బోయపాటి శ్రీను & బాలయ్య కాంబినేషన్ మరోసారి పలు అంచనాలు రేపుతోంది.
టీజర్ ప్రారంభం నుంచే హిమాలయాల్లో శివస్తోత్రాల నేపథ్యం, అనంతరం శూలం చేతబట్టి బాలయ్య… గంభీరమైన డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో గూస్‌బంప్స్ కలిగించింది. థమన్ సంగీతం మరోసారి హై వాల్యూమ్ ఇంటెన్సిటీని అందించింది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఆదిపినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ దసరా కానుకగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.