PARADISE DELAY | ప్యారడైజ్ వాయిదా.. ఇదే సాక్ష్యం..
PARADISE DELAY | ప్యారడైజ్ వాయిదా.. ఇదే సాక్ష్యం..
PARADISE DELAY | ఇరుముడి ఎంట్రీతో ప్యారడైజ్ రిలీజ్‌పై కొత్త సందేహాలు
మార్చి 26న ప్యారడైజ్ మూవీ రిలీజ్
PARADISE DELAY | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రేజీ మూవీ ప్యారడైజ్. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే.. మార్చి 26న ప్యారడైజ్ మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. ఆతర్వాత మార్చి 26 నుంచి ఆగష్టు 21కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మరోసారి ప్యారడైజ్ వాయిదా కానుందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇన్ సైడ్ న్యూస్ లీకవ్వడానికి కూడా ఓ కారణం ఉంది. ఇంతకీ.. ఏమైంది..?
PARADISE DELAY | షాకింగ్ క్యారెక్టర్లో నాని..
నాని, శ్రీకాంత్ ఓదెల.. ఈ క్రేజీ కాంబోలో దసరా సినిమా రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో ప్యారడైజ్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్స్ పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని అందరికీ నచ్చేలా తీస్తున్నారని వార్తలు వస్తుండడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా నాని ఇంతకు ముందు ఎప్పుడూ చేయని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడని.. ఇంకా చెప్పాలంటే.. ఆ క్యారెక్టర్ షాకింగ్ గా ఉంటుందని తెలిసినప్పటి నుంచి నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

PARADISE DELAY | ఆయా షేర్.. సరికొత్త రికార్డ్..
ఈ మూవీ నుంచి ఆయా షేర్ అంటూ సాగే పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో శ్రీకాంత్ ఓదెల సృష్టించిన రఫ్ అండ్ రస్టిక్ ప్రపంచం, నాని పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ ఎనర్జిటిక్ బీట్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సాంగ్ తెలుగు వెర్షన్‌లోనే 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ సాధించి, నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

PARADISE DELAY | ప్యారడైజ్ డేట్ కి వస్తున్న రవితేజ ఇరుముడి..
ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 21న వస్తుందని ప్రకటించినా.. మరోసారి ఈ సినిమా వాయిదా అంటూ ప్రచారం మొదలైంది. అయితే.. అలాంటిది ఏమీ లేదు.. ప్యారడైజ్ ఆగష్టు 21న రావడం పక్కా అని అంటున్నారు కానీ.. పోస్ట్ పోన్ కన్ ఫర్మ్ అని తెలుస్తుంది. కారణం ఏంటంటే.. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మూవీ ఇరుముడి. ఈ సినిమాకి శివ నిర్వాణ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మూవీని ఆగష్టు 21న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

PARADISE DELAY | ప్యారడైజ్ వచ్చేది ఎప్పుడు..?
నాని ప్యారడైజ్ మూవీని కూడా ఆగష్టు 21నే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాంటిది ఇరుముడి ఆగష్టు 21న రిలీజ్ అని అనౌన్స్ చేసారంటే.. ప్యారడైజ్ రావడం లేదని.. అందుకనే ఇరుముడి ఆ డేట్ లో వస్తున్నట్టు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. పాపం నాని.. ప్యారడైజ్ మూవీని మార్చి నుంచి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి.. ప్యారడైజ్ రిలీజ్ పై నేచురల్ స్టార్ నాని త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
