Bangalore | క‌మ‌ల్ హాస‌న్ కు కోర్టు షాక్.. క‌న్న‌డంపై మాట్లాడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ వార్నింగ్

బెంగ‌ళూరు – ఇటీవ‌ల కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ కామెంట్స్‌పై కన్నడనాట పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. కమల్ (Kamal Haasan) వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కన్నడ సాహిత్య పరిషత్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కన్నడ భాషపై కమల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిషేధించాలని పిటిషన్‌లో కోరింది.

ఈ పిటిషన్‌ (Petition) పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కన్నడ భాషపై అధిపత్యాన్ని ప్రదర్శించేలా మాట్లాడకూడదు. కన్నడ భాష, సంస్కృతికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు’’ అని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ (investigation) ను అగస్టు 30కి వాయిదా వేసింది. కన్నడ భాషపై కమల్ మాట్లాడకూడదని.. ఒకవేళ మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Leave a Reply