కోడూరులో జనసేన నేతల ప్రార్థనలు..

కోడూరు, ఆంధ్రప్రభ ; జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సూచనల మేరకు కోడూరు జనసేన పార్టీ నాయకులు దేవాలయాల్లో, చర్చల్లో, దర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

ఆదివారం నాడు కోడూరు మండల పరిధిలోని కృష్ణాపురం లో గల ఆర్.సి.యం చర్చికి జనసేన నాయకులు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆర్ సి యం విచారణ గురువు చౌటుపల్లి ప్రశాంత్ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోడూరు మండల అధ్యక్షులు మరే గంగయ్య, జనసేన పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కాగిత రామారావు, మల్ల వెంకటేశ్వరరావు,పెద్ది బాబురావు, బెల్లంకొండ సుబ్బయ్య,పరిసే వెంకటేశ్వరరావు, అల్లం శెట్టి రాజేంద్రప్రసాద్ కోట వేణు జరుగు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply