దేశంలో ఫస్ట్.. జూబ్లీహిల్స్..

దేశంలో ఫస్ట్.. జూబ్లీహిల్స్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వీ కర్ణన్ డ్రోన్ సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. దేశంలోనే ఒక నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను డ్రోన్ ల సహాయంతో పర్యవేక్షణ చేయడం ఇదే మొదటిసారి కావడం.. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే ప్రారంభం కావడం విశేషం.
