95seats | కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం
95seats | కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం
95seats | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నట్లు తాజా ట్రెండ్స్ సూచిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజా లెక్కల ప్రకారం ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ సుమారు 2,812 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ పరిణామంతో ఆ నియోజకవర్గంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చూస్తే యూడీఎఫ్ కూటమి 95 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ కంటే యూడీఎఫ్ ముందంజలో ఉండటం రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తోంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఫలితాలు ఎలా మారుతాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
