గుర్తు తెలియని వాహనం ఢీకొని..

వ్యక్తి అక్క‌డిక‌క్క‌డే మృతి

భీమదేవరపల్లి మే 4 (ఆంధ్రప్రభ) గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ముల్కనూర్ గ్రామానికి చెందిన గంప రమేష్ (55) అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. సోమవారం ఉదయం తెల్లవారుజామున మార్నింగ్ వాకింగ్ చేసేందుకు ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా నుండి హనుమకొండ ప్రధాన రహదారిపై వెళుతుండగా వెనుక నుండి అది వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడు గతంలో శ్రీదేవి సౌండ్ సెంటర్ షాపును నిర్వహిస్తుండేవాడని దీంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ జరిగిన సంఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తును ప్రారంభించినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.