Website | కొత్త సినిమాల పైరసీతో కలకలం

Website | కొత్త సినిమాల పైరసీతో కలకలం

Website | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ మళ్లీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. థియేటర్లలో ప్రదర్శితమవుతున్న కొత్త సినిమాలను సైతం అందుబాటులోకి తెస్తూ నిర్మాతలకు భారీ నష్టాలు కలిగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి అరెస్ట్ అనంతరం ఐబొమ్మ కార్యకలాపాలు నిలిచిపోయాయని భావించారు. అయితే రవి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ యాక్టివ్ కావడం చర్చనీయాంశమైంది.

థియేటర్లలో ప్రదర్శితమవుతున్న తాజా సినిమాలు కూడా తక్షణమే వెబ్‌సైట్‌లో కనిపిస్తుండటంపై సినీ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.