వర్షాలు సమృద్ధిగా కురవాలనీ ప్రత్యేక పూజలు..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ ఆద్వర్యంలో వర్షాల సమృద్ధిగా కురవాలనీ గ్రామ ప్రజలు,మహిళలు,రైతులతో కలిసి డప్పు చప్పుళ్లతో సాంప్రదాయ పద్ధతుల్లో గ్రామంలోని ఆలయాలలో గ్రామ దేవతలను ప్రార్థిస్తూ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో,వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామ దేవతలకు సంప్రదాయ పూజలు,జలాభిషేకాలు చేసినట్లు తెలిపారు.

వర్షాలు సమృద్ధిగా కురువాలని,పంట దిగుబడి రావాలని,చెరువులు నిండి జలకళ సంతరించుకోవాలని, పశుపక్షాదులు చల్లగా ఉండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.వరునదేవుడు తమ ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో విడిసి సభ్యులు,గ్రామ ప్రజలు,మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.