Annamalai | తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర?
Annamalai | తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర?
Annamalai | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
అన్నామలై పార్టీని వీడకుండా నిలువరించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం పలుమార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే పార్టీ భవిష్యత్ వ్యూహాలు, తమిళనాడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక నేతను కోల్పోయినట్లయింది.
రాజీనామా అనంతరం అన్నామలై తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తి నెలకొంది. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ స్థాపన దిశగా ఆయన ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అన్నామలై నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
