బదిలీ అయిన అదనపు ఎస్పీకి ఘన సత్కారం

బాసర, నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : బైంసా పట్టణం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అదనపు ఎస్పీగా బదిలీ అయిన అవినాష్ కుమార్‌కు శనివారం బాసరలో ఘన సత్కారం జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ముధోల్ సీఐ మల్లేశ్‌, బాసర సీఐ సాయికుమార్‌ కలిసి అదనపు ఎస్పీ అవినాష్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, సరస్వతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇందుకు ముందు ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైంసాలో సేవలు అందించడం ఆనందంగా ఉందని, అక్కడి సిబ్బంది నుంచి ఎల్లప్పుడూ మంచి సహకారం లభించిందని అవినాష్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీ దేవి, ఆలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.