నాణ్యమైన విద్యతోనే పరిపూర్ణ సమాజం
నాణ్యమైన విద్యతోనే పరిపూర్ణ సమాజం
- కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజుగౌడ్
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : నాణ్యమైన విద్యతోనే పరిపూర్ణ సమాజం రూపుదిద్దుకుంటుందని 27వ వార్డు కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజుగౌడ్ సంగారెడ్డి పట్టణంలోని గణేష్ నగర్‌లో వేదన్య స్కూల్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ కౌన్సిలర్ మంజులత నాగరాజుగౌడ్, వేణు భగవాన్ హాజరై రిబ్బన్ కట్‌చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ నర్సరీ నుంచి 7వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు క్రమశిక్షణ, సాంస్కృతిక విలువలను కూడా బోధించనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు దామోదర్‌రెడ్డి, ఉపేందర్, మనోహర్‌గౌడ్, సంజయ్ హోట్‌కేర్, వివేక్ కుమార్, సంజయ్ సోనాలి, ప్రేమ్‌కుమార్, రవితేజ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గన్నారు.
