రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

  • రాజంపేట ఫిల్టర్ బెడ్ వద్ద అత్యవసర మరమ్మతులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలకు మే 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మ‌ట్ట శ్రీ‌నివాస్‌రెడ్డి ప్రకటించారు. రాజంపేట ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న 600 ఎంఎం ప్రధాన పైప్‌లైన్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మరమ్మతుల కారణంగా గంజ్ మైదాన్ ట్యాంక్ (500 కేఎల్), గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ట్యాంక్ (300 కేఎల్), మంజీర ట్యాంక్ (800 కేఎల్), తారా ట్యాంక్ (500 కేఎల్) పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. మే 21నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply