Mass Raja | భర్త మహాశయులకు విజ్ఞప్తి.. మెప్పించాడా…

Mass Raja | భర్త మహాశయులకు విజ్ఞప్తి.. మెప్పించాడా…

Mass Raja | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాని కిషోర్ తిరుమల (Kishore Tirumala) తెరకెక్కించాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ అండ్ ట్రైలర్ కు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. మరి.. ఈ రోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్ లోకి వచ్చింది. మరి.. మాస్ రాజా మెప్పించాడా..? లేదా..? రియల్ టాక్ ఏంటి..?

Mass Raja | కథ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ…

థియేటర్స్ కి వచ్చిన ఆడియన్ ని నవ్వించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని డైరెక్టర్ కిషోర్ తిరుమల తీసాడు అనిపిస్తుంది అంటున్నారు సినిమా చూసిన జనాలు. అక్కడక్కడా తడబడినా కామెడీ (Comedy) మాత్రం బాగా వర్కవుట్ అయ్యిందట. ఎక్కడా బోర్డర్ దాటకుండా మంచి ఫ్లోలో వెళ్లేలా సీన్స్ రాసుకున్నాడట. మాస్ ని టార్గెట్ గా పెట్టుకుని తీసిన కొన్ని సీన్స్ అయితే.. థియేటర్ లో కడుపుబ్బా నవ్వేలా ఉన్నాయని టాక్. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత సునీల్ ఇందులో కామెడీతో అదరగొట్టేసాడట. అలాగే సత్య కూడా తనదైన కామెడీ టైమింగ్ తో.. బాగా ఎంటర్ టైన్ చేసాడని టాక్ వినిపిస్తోంది.

Mass Raja

Mass Raja | ఇదేదో మాస్ ని టార్గెట్ గా పెట్టుకుని తీసిన క్రింజ్ కామెడీ కాదట..

క్లాస్ కామెడీనే అని అంటున్నారు. కథ కొత్తగా ఉండాలి.. అదరిపోయే యాక్షన్ (Action) ఉండాలి.. అని ఆలోచించకుండా ఫ్యామిలీతో హాయిగా నవ్వుకోవాలి అనుకునేవాళ్లకి పర్ ఫెక్ట్ మూవీ భర్త మహాశయలకు విజ్ఞప్తి అనే టాక్ వచ్చింది. రవితేజ (Raviteja) ఈమధ్య కాలంలో చేసిన సినిమాల్లో బెస్ట్ ఇది అంటున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి కానుకగా థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Mass Raja

CLICK HERE TO READ బాలీవుడ్ హీరోను రంగంలోకి దింపుతున్న జక్కన్న..?

CLICK HERE TO READ MORE

Leave a Reply