Arrest | గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Arrest | గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Arrest | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్(arrest) చేసినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నెక్కొండ సీఐ.శ్రీనివాస్, ఎస్. ఐ. రాజేష్ రెడ్డిలు తెలిపారు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని అక్కలచెడ గ్రామానికి చెందిన ప్రదీప్ అను వ్యక్తి వేరే రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొచ్చి మండలంలో పలువురికి ఎక్కువ ఎక్కువ ధరలకు విక్రయించడానికి అలవాటు పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్కల్ చెడ క్రాస్ రోడ్ వద్ద మాటు వేసి ప్రదీప్ వద్ద మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీన పరుచుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్(remand)కి తరలించినట్లు తెలిపారు.

Leave a Reply