బీజేపీ నిరసన గళం.. కూటమి దిష్టిబొమ్మ దగ్ధం

చెన్నూర్ (ఆంధ్రప్రభ): మహిళా బిల్లును అమలు చేయాలన్న డిమాండ్‌పై కాంగ్రెస్, ఇండియా కూటమి వైఖరికి వ్యతిరేకంగా భాజపా ఆధ్వర్యంలో చెన్నూర్ మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేపట్టి, అనంతరం రాహుల్ గాంధీ ఇండియా కూటమి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ నిరంతరం అడ్డుకుంటోందని ఆరోపించారు. 1996 నుంచి ఇప్పటి వరకు బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి కాంగ్రెస్ నాయకత్వమే కారణమని విమర్శించారు.

2013లో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 2023లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టి విజయవంతం చేసిందని, 2029లో అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మరోసారి అడ్డుకుందని ఆరోపించారు.

మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, మహిళల ఆశలపై నీళ్లు చల్లిందని పేర్కొన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు బుర్ర రాజశేఖర్, 17వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, సీనియర్ నాయకులు ప్రాపర్టీ వెంకటేశ్వర్, రత్న లక్ష్మీనారాయణ రెడ్డి, మహిళా నాయకురాలు ఎడ్ల స్వరూప రాణి, ముత్యాల శ్రావణి, చెన్నూర్ మండల పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మాణికరావు, శంకర్, కొఠారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply