Temple | హరి హర నామ స్మరణతో మార్మోగనున్న కొత్తకొండ

Temple | హరి హర నామ స్మరణతో మార్మోగనున్న కొత్తకొండ

  • కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వీరభద్రుడు
  • భద్రకాళి సమేత వీరభద్రుని బ్రహ్మోత్సవాలలో పాల్గొనండి : రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Temple | భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో హరిహర నామస్మరణతో మార్మోగానున కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరిగే కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం వీరభద్రునీ దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు.

ఈ బ్రహ్మోత్సవాల(Brahmotsavala) కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఓ ప్రకటనలో కోరడం జరిగింది. ఈనెల 10న స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేలాదిమంది భక్తుల మధ్య కనుల పండుగ నిర్వహించడంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18న అగ్ని గుండాల కార్యక్రమంతో ముగియనున్నాయి.

Temple |

ఈ బ్రహ్మోత్సవాల ను తిలకించేందుకు సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల కోసం చలవ బందీలను సిద్ధం చేయడంతో పాటు తాగునీటి సౌకర్యాన్ని, తీర్థ స్నానాలను ఆచరించేందుకు నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఆలయంతో పాటు ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరణ ఆలయ కూడలి వద్ద రూ.20 లక్షల తో నిర్మించిన త్రిశూలం కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 350 మంది పోలీస్ సిబ్బంది(police personnel)తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయము చుట్టుప్రక్కల 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, 150 మంది పారిశుద్ధ సిబ్బందితో పరిసరాల పరిశుభ్రతను, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

వివిధ శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని బ్రహ్మోత్సవాలలో పాల్గొని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Temple |

ఆలయ విశిష్టత :: శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరజిల్లుతున్న కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం పురాతన చరిత్ర కలిగి శిల్పకళ వైభవంతో ప్రాముఖ్యత పొందింది.. కొండపై భాగంలో విశేషంగా సప్త కోనేరులతో అహ్లాదకరమైన వాతావరణం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది.

మొదటగా గుట్టపై వెలసిన వీరభద్రుని కాకతీయ రుద్రేశ్వరుని కాలంలో కీ.శ.1600 ప్రాంతంలో శ్రీ మల్లికార్జున పండితుని మనుమడు కేదారి పండించే శైవాగమానం ప్రకారం గుట్ట కిందికి తీసుకువచ్చి ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దక్షయాగం అనంతరం స్వామి వారు కొత్తకొండ గుట్టపై వెలిశారని ప్రశస్థి.

అందుకు అనుగుణంగానే స్వామి వారి ఆలయం చుట్టూ సప్త గుండాలు ఏర్పడ్డాయని కీ.శ. 1600 వందల సంవత్సరాల క్రితం కొంతమంది కుమ్మరులు కొండపైకి కట్టెల కోసం ఎడ్లబండ్లతో వెళ్లినవారు విశ్రాంతి తీసుకున్న సమయంలో వారితో తీసుకువచ్చిన ఎడ్ల పండ్లు ఎడ్లు కనిపించకపోవడంతో వాటికోసం వెతికిన కుమ్మరులు కొండపైనే నిద్రించడం జరిగింది.

Temple |

ఆ సందర్భంగా కుమ్మరులకు స్వామివారు స్వప్నంలో కనిపించి నన్ను కొండపై నుండి కిందికి దించి ఆలయంలో ప్రతిష్టించాలని ఆజ్ఞాపించారని దాంతో ఈ ప్రాంతాన్ని ఏలుతున్న మల్లికార్జున పండితుని మనవడు కేదారి పండితునికి జరిగిన విషయాన్ని వివరించగా ఆయన ఎంతో భక్తి భావంతో ప్రతిష్టించినట్లు పురాణాల్లో చెప్పబడుతుంది. ఆనాటి నుండి దేవాలయంలో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను శైవాగమానం ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.

ఈ ఉత్సవాల సందర్భంగా సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి మారే సమయంలో స్వామివారికి జరుగు బ్రహ్మోత్సవాలలో మకర సంక్రాంతి రోజున స్వామివారి నిజ దర్శనం చూసిన భక్తులకు సర్వ పీడల నుండి విముక్తి కలుగుతుందని శాస్త్రం చెప్పబడుతోంది. ఈనెల 10న వీరభద్రుడి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.

Temple |

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 14న భోగి, 15న మకర సంక్రాంతి రోజున ఉత్తరాయన పుణ్యకాలమందు స్వామివారిని దర్శించుకోవడం ఎంతో శ్రేష్టమైందని భక్తుల విశ్వాసం. ఆరోజు ప్రత్యేకంగా కుమ్మరుల ఎడ్ల బండ్లు తిరిగిన అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఎడ్లబండ్ల తో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది.

Temple |

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 18న నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు సమస్త శరీర బాధలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కైలాసానికి క్షేత్రపాలకుడైన వీరభద్రుని దర్శించుకోవడం మూలంగా బ్రహ్మ రాక్షస, యక్ష,యమదూత, శకుని,సర్ప,శ్వాస,జ్వరాది,నరగోష,శత్రుఘోషాలు,ఉపద్రవాల తో పాటు రోగ బాధలు రుణ బాధల నుండి విముక్తి పొందవచ్చని భక్తుల నమ్మకం.

CLICK HERE TO READ MORE : 6stotras | ఇవి చదువుకోండి చాలు..

CLICK HERE TO READ MORE :

Leave a Reply