Rs. 134 crore | బీజేపీకి ఓటేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తది

Rs. 134 crore | బీజేపీకి ఓటేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తది

  • కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్

Rs. 134 crore | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అదమరచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లలో సిరిసిల్లకు తాను రూ. 134 కోట్ల(Rs. 134 crore) కేంద్ర నిధులు తీసుకువచ్చానని, రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబుతున్నారని అలాంటి వాళ్లకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదే అన్నారు. 6 గ్యారెంటీలను అమలుపరచడం మర్చిపోయిన ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. దొంగ మాటలు మాయ మాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి సిరిసిల్ల వేములవాడ, మున్సిపాలిటీల్లో కాషాయపు జెండా ఎగిరేలా చూడాలన్నారు.

ఒక్క డిఏ ఇస్తే ఉద్యోగులు మోసపోరు

6 డిఏలు బకాయిలు ఉండగా కేవలం ఒక్క డిఏ ఇచ్చి ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలుకుతున్నారని, మీ మాయమాటలకు ఉద్యోగస్తులు మోసపోరూ. వారికి న్యాయంగా రావలసిన మొత్తం డిఏలు ఇవ్వకుండా ఒక్క డిఏ ఇచ్చేందుకు సంతకం చేశానని ముఖ్యమంత్రి(Chief Minister) కొత్త డ్రామాకు తెర లేపారన్నారు. ఉద్యోగస్తులకు కోటి రూపాయల ప్రమాద బీమా అని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, బ్యాంకు ఖాతా ఉన్నవారికి బ్యాంకులే ప్రమాద బీమా అందిస్తున్నాయన్నారు.

రిటైర్డ్ ఉద్యోగులు వాళ్లకు రావలసిన బకాయిల కోసం నిరసన తెలియజేస్తే అరెస్టు చేయించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది అన్నారు. వెంటనే డిఎ లు మొత్తం విడుదల చేసి, ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

కెసిఆర్ నిండు నూరేళ్లు జీవించాలి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నదన్నారు. బీజేపీ ఎవరిచావు కోరుకోదని, కెసిఆర్ తాను ఉన్నానని చెప్పేందుకు ప్రతి నెల ఒకసారి యశోద ఆసుపత్రి(Yashoda Hospital)కి వచ్చి వెళుతుంటాడన్నారు.

కెసిఆర్ ఇంట్లో కూతురు ఓ దారి చూసుకుంది, అల్లుడు మరోదారి వెతుక్కుంటున్నాడని, కొడుకు రాష్ట్రమంతా తిరుగుతున్న ప్రజలు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం.

జిహెచ్ఎంసి పై కాషాయపు జెండా

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుంది. జిహెచ్ఎంసి పై కాషాయపు జెండా ఎగరడం ఖాయం. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలను బీజేపీ గెల్చుకుంటుంది. అత్యధిక మున్సిపాలిటీల్లో బీజేపీ గెలవబోతోంది.

Leave a Reply