Trust | అన్నార్తులకు అండగా..

Trust | అన్నార్తులకు అండగా..

  • కళ్ళే లలిత ట్రస్ట్ని నిత్యాన్నదానం
  • కళ్ళే లలిత వీధిలో 50నెలలు నుంచి..

Trust | పాయకాపురం, ఆంధ్ర‌ప్ర‌భ : కళ్ళే లలిత ట్రస్ట్ అన్నార్తులకు అండగా ఉంటుంద‌ని ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ కళ్ళే లలిత వీధిలో గత 50నెలల నుంచి ప్రతి నెలా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్ళే లలిత ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు పాల్గొని స్వర్గీయ కళ్ళే లలిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు.

సింగ్ నగర్ ప్రాంతంలో స్వర్గీయ కళ్ళే లలిత జ్ఞాపకార్ధం, కళ్ళే లలిత వీధిలో అన్నార్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ట్రస్ట్ డైరెక్టర్లు ప్రతీ నెల క్రమం తప్పకుండా పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారని అన్నారు. స్వర్గీయ కళ్ళే లలిత భౌతికంగా దూరమైన నాటి నుంచి ప్రతీ నెల 12వ తేదీన క్రమం తప్పకుండా గత 50నెలల నుంచి పేదలకు సింగ్ నగర్ ప్రాంతంలోని కళ్ళే లలిత వీధి వద్ద అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తమకు కలిగిన ఆర్ధిక స్థోమత బట్టి పేదలకు ఆహారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. కళ్ళే లలిత బ‌తికి ఉన్న రోజులలో అన్నార్తుల ఆకలి తీర్చాలని తెలపడం జరిగిందని, అందుకే ప్రతి నెల వారికి భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కళ్ళే నాగేశ్వరరావు అన్నారు. రానున్న రోజులలో కళ్ళే లలిత ట్రస్ట్ సేవలు ద్వారా పేదలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కళ్ళే సీతా మహాలక్ష్మిముప్పూరి హరీష్, ఎమ్.జశ్విన్, జి.ధ్రువన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply