Jukkal | వివేకానంద స్ఫూర్తితో..

Jukkal | వివేకానంద స్ఫూర్తితో..
- యువత ముందుకు సాగాలి
Jukkal | జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ: స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పెద్ద ఎడ్గి గ్రామసర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్ అన్నారు. జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని పెద్దఎడ్గిలో ఐక్యత యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్ ఐక్యత యూత్ సభ్యులు, గ్రామస్తులతో కలిసి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.
భారతదేశ ఆధ్యాత్మికత, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందకు దక్కుతుందని, ధైర్యసాహసాలకు, సేవా గుణానికి మరోపేరు స్వామి వివేకానంద అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ ఫాయ్యుమ్, ఐక్యత యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
