Kamareddy | శాబ్దిపూర్ లో యువకుని ఆత్మహత్య

Kamareddy | శాబ్దిపూర్ లో యువకుని ఆత్మహత్య

Kamareddy | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్‌లో చోటుచేసుకుంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే… శాబ్దిపూర్ తండాకు చెందిన మలవత్ సాయికుమార్‌ (20) శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయికుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం కుటుంబంలో చిన్నపాటి గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన అతడు శాబ్దిపూర్ తండా శివారులోని పుల్చేరుకుంటలో దూకాడు. స్థానికులు వెంటనే అతడిని నీటిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply