Ball Badminton | నేషనల్ బాల్ బ్యాడ్మింట్‌కి మోహన్ ఎంపిక..

Ball Badminton | నేషనల్ బాల్ బ్యాడ్మింట్‌కి మోహన్ ఎంపిక..
Ball Badminton | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామానికి చెందిన ఉడుత మోహన్ ఆల్ ఇండియా(All India) యూనివర్సిటీ, నేషనల్ బాల్ బ్యాడ్మింట్(Ball Badminton) గేమ్స్ కి ఎంపికైనట్లు జయశంకర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఈ రోజు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ మోహన్ గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన బ్యాట్మెంటు పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి అవార్డులు, ప్రశంస పత్రాలు పొందినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14 నుండి 17 వరకు తమిళనాడు రాష్ట్రంలోనీ భారతీయ దసన్ యూనివర్సిటీలో జరిగే నేషనల్ బాల్ బ్యాడ్మింట్ గేమ్స్ , టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు.
యూనివర్సిటీ బ్యాడ్మింటన్ లో జాతీయస్థాయికి మోహన్ ఎంపిక కావడంతో బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, క్రీడ అభిమానులు, మండల ప్రజలు అభినందనలు తెలిపారు .
