ఆలయ నిర్మాణానికి భారీ విరాళం…..
ఆలయ నిర్మాణానికి భారీ విరాళం…..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని తాళ్ల మల్కాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ఆదివారం భారీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయ పనుల కోసం తమ వంతు బాధ్యతగా దాతలు విరాళాలను ఆలయ కమిటీకి సమర్పించారు. వట్టికూటి యశ్వంత్ తల్లి రాధా, వట్టికూటి రాంబాబు ధర్మపత్ని సరిత, వట్టికూటి అంజయ్య (లాయర్), ధర్మపత్ని శ్రీలత కలిసి రూ. 1,10,116/- నగదును కమిటీ సభ్యులకు అందజేశారు.
అలాగే, వట్టికూటి శేషయ్య ధర్మపత్ని సరోజనమ్మ, వారి కుమారుడు నాగరాజు ధర్మపత్ని స్వరూప వాని పేరు వంశీ కలిసి రూ. 30,116/- విరాళంగా ఇచ్చారు. గౌడ కులస్తుల ఐకమత్యం అభినందనీయం ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గ్రామంలో గౌడ కులస్తులందరూ ఐకమత్యంతో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమని కొనియాడారు. భక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించాలని వారు పిలుపునిచ్చారు. అందరి కృషితో ఆలయం త్వరగా పూర్తి కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ విరాళం అందజేసిన వారి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ ప్రత్యేకంగా అభినందించి, కృతజ్ఞతలు తెలియజేసింది.
