Super star Family | జయకృష్ణ.. లుక్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్..

Super star Family | జయకృష్ణ.. లుక్ రిలీజ్ చేసిన సూపర్ స్టార్..

Super star Family | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రంతో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) రిలీజ్ చేశారు. జయకృష్ణకు మహేష్‌ తన బెస్ట్ విశెస్ తెలియచేశారు. శ్రీనివాస మంగాపురం ఫస్ట్ లుక్ పోస్టర్ లో జయకృష్ణ యాక్షన్ మోడ్ లో ఆకట్టుకుంటున్నారు. బైక్ పై వస్తూ చేతిలో పిస్టల్ తో జయకృష్ణ ఉన్న స్టిల్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

Super star Family

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి.. మంగళవారం చిత్రంతో మరో సక్సెస్ సాధించిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. లవ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు సగం వరకు షూటింగ్ పూర్తయ్యింది. ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ (Producer) అశ్వనీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయకృష్ణ సరసన బాలీవుడ్ నాయిక రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. లాంఛింగ్ మూవీనే ఇంటెన్స్ యాక్షన్ లవ్ థ్రిల్లర్ కావడంతో జయకృష్ణకు మంచి ఎంట్రీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి.. జయకృష్ణ తొలి సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Super star Family

CLICK HERE TO RAED సంగీత్ శోభన్ కి సక్సెస్ వచ్చేనా..?

CLICK HERE TO READ MORE