HYD | ఉస్మానియాలో టెన్ష‌న్ .. ఏబీవీపీ నేత‌ల అరెస్ట్..

హైద‌రాబాద్ : విద్యార్థుల స్వేచ్ఛను కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళ‌న‌ల‌ను నిషేదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉత్త‌ర్వుల‌ను నిర‌సిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో యూనివర్సిటీలో అవాంచిత ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

యూనివర్సిటీ హాస్టళ్లలోకి ప్రవేశించి బందుకు పిలుపునిచ్చిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ స్టూడెంట్ లీడర్లను పోలీసులు యూనివర్సిటీ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఖబర్ధార్ వీసీ అంటూ విద్యార్థుల హక్కులకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *