Raviteja | అది మాత్రం కొత్తగా ఉంటుంది..

Raviteja | అది మాత్రం కొత్తగా ఉంటుంది..

Raviteja | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ చెప్పిన సమ్ గతులు మీ కోసం..

Raviteja | అలా.. చేయడం చాలా కష్టం..

ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ముందు ఒక ప్రాజెక్ట్ (Project) చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన ఇది కుదరలేదు. తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ చెప్పారు. కథ విన్నప్పుడే.. ఇందులో మోడ్రన్ గర్ల్ (Modren Girl) పాత్ర చేయాలని అనుకున్నాను. ఆయన కూడా అదే పాత్రకి అనుకున్నానని చెప్పారు. నా సామిరంగతో పోల్చుకుంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ క్యారెక్టర్. ఖచ్చితంగా నా కెరీర్ లో చాలా కొత్తగా వుంటుంది. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అందులోనూ నాకు తెలుగు అంతగా రాదు. అయితే.. డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయన చాలా సెన్సిబుల్ డైరెక్టర్. మా పాత్రలని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. కాస్ట్యుమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. డైరెక్టర్ నా క్యారెక్టర్ చాలా అందంగా చూపించారు.

Raviteja

Raviteja | అద్భుతమైన పెర్ఫార్మార్..

కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రల్లో ఎలాంటి తప్పులు కనిపించవు. కాకపోతే ఇప్పుడు కథల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది. అలాంటి పాత్రలని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చుపిస్తున్నారు. ఇప్పుడున్న రిలేషన్షిప్స్ లో చాలా కాన్ఫ్లిక్ట్స్ వున్నాయి. అలాంటి అంశాలని దర్శకుడు (Director) అద్భుతంగా అందరూ రిలేట్ అయ్యేలా హ్యాండిల్ చేశారు. రవితేజ అద్భుతమైన పెర్ఫార్మార్. ఫన్ ఎమోషన్ అద్భుతంగా పండించారు. ఆయనతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

Raviteja

Raviteja | మెమరబుల్ ఎక్స్ పీరియన్స్..

ఇందులో సత్య నా పీఏ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అది నవ్వులు పంచే క్యారెక్టర్. రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్, సత్య అందరూ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న నటులు. వాళ్ళ టైమింగ్ ని మ్యాచ్ చేయడం ఛాలెంజ్ గా అనిపించింది. నా ప్రతి సినిమా (Movie) డిఫరెంట్ గా వుండాలని అనుకుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కొత్తదనం ఫీలౌతారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం స్పెయిన్ లో షూట్ చేశాం. సినిమా విజువల్ గా చాలా రిచ్ గా వుంటుంది. ఇందులో మాస్ సాంగ్ చేసినప్పుడు చిరంజీవి గారు సెట్స్ లోకి రావడం మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. ప్రస్తుతం విశ్వంభర, సర్దార్ 2 చిత్రాలు చేస్తున్నాను. అలాగే అది నా పిల్లరా అనే మరో సినిమా చేస్తున్నాను. కెరీర్ బిగినింగ్ లోనే బిగ్ స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

Raviteja

CLICK HERE TO READ సరికొత్త సస్పెన్స్ డ్రామా చీకటిలో..

CLICK HERE TO READ MORE

Leave a Reply