AP Local War Siren : చంద్ర పవనం AndhraPrabha SPL Story

AP Local War Siren : చంద్ర పవనం AndhraPrabha SPL Story
జనదేశం నాయకులు బిజీబిజీ
జనంతో..జనం కోసం.. జనంలో మమేకం
‘ఆపరేషన్ టార్గెట్ వైసీపీ’ షురూ
విపక్షానికి చుక్కలే,, చుక్కలు..
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

ఏపీలో కూటమి అప్పుడే స్థానిక సమర భేరీ మోగించింది. అధికార కూటమి తన వ్యూహాన్ని తెరమీదకు తీసుకు వచ్చింది. ప్రతిపక్ష పార్టీకి గుక్క తిప్పుకోలేని షాక్‌లు ఇస్తోంది. ఇప్పటి వరకూ పోలీసు కేసులతో.. ఫైర్ బ్రాండ్ లను నోళ్లకు తాళాలు వేస్తే.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం.. దోస్తులిద్దరూ దూసుకు పోతున్నారు.
ఇప్పటి వరకూ జనం దగ్గరకు వెళ్లటానికి నానా ఇబ్బంది పడే ఈ దిగ్గజాలు నేరుగా.. జనంలోకి వెళ్లిపోతున్నారు. జనం గుండె చప్పుళ్లుగా మారుతున్నారు. జనం కోసం, జనం నేతలుగా.. జనం హృదిలో.. మదిలో గూడు కట్టేస్తున్నారు. ఈ సీన్ ల విశ్రాంతి సమయంలో,, వైసీపీని తూర్పారబట్టేస్తున్నారు. గత ప్రభుత్వం వ్యవహార శైలిని ఎండగడుతూ,, అవినీతి, అక్రమాల ఆరోపణను ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు.

ఈ రోజు శుక్రవారం (09.01.2026) న ఇటు సీఎం (Ap Cm Chandra Babu) చంద్రబాబు నాయుడు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Dy.Cm Pawan Kalyan) జనంలో కలిసిపోయారు. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందడి చేశారు. అంతే కాదు. పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులను ప్రారంభించారు.

ఇక పిఠాపురం వీధుల్లో పర్యటించారు. సాధారణ నేత స్టయిల్ లో జనం దగ్గరకు వెళ్లారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో శాంతిభద్రతలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పోలీసులంటే.. స్టిప్ గా నిలబడి శాల్యూట్ కొట్టటం కాదు.. జనంతో సమానం అనే రీతిలో వ్యవహరించారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వెళ్లే నాయకుడిలా కాకుండా.. కింది స్థాయి సిబ్బందిని పలకరించారు. ఇక జనంలో జనం మనిషిని అని నిరూపించుకున్నారు. సామాన్యుడి కౌగిలింతతో.. సామాన్యుడి గుండెల్లో నిలిచిపోయారు.
AP Local War Siren : ఇక వైసీపీకి వార్నింగ్ సిగ్నల్స్ ..

వైసీపీ నేతల ఆరోపణలను తూర్పారబట్టారు. కులాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నాలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతిని చీల్చి చెండాడారు. కేసుల విచారణలో.. పోలీసులు ఎక్కడ తగ్గవద్దని.. పోలీసులకు ప్రభుత్వం భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారు.

పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగినా, పక్షి ఈక రాలినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు.. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుంది. ఎంతో విజ్ఞత ఉన్న రాజకీయ నాయకులే మాటకు మాట అనుకుంటున్న రోజులివి. అలాంటిది చిన్న పిల్లలు ఒక మాట అనుకోరా? దానికి కులాలను మధ్యలోకి తీసుకురావాలా? అని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
AP Local War Siren : వీళ్లకు బూతులే వచ్చు
గత ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటే… బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయడం. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దాం.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను. అపి డిప్యూటీ సీఎం వార్నింగ్ జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు.

ముఖ్యమంత్రి కావొచ్చు, నేను తప్పు చేసినా శిక్షించే పరిస్థితులు ఉండాలని అసెంబ్లీలో చెప్పాం. నన్ను ఒక మాట అన్నా పడతాను, పార్టీని దూషించినా భరిస్తాను.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఉపేక్షించను. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా మాటలు మెత్తగా ఉంటాయి.. కానీ చాలా గట్టిగా తీసుకుంటాను. అని డిప్యూటీ సీఎం (Dy.Cm pavan Fired) హెచ్చరించారు.
AP Local War Siren: అరమరికలు లేవు

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.50 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకుగానూ ప్రతి నెల రూ. 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా హడావుడి లేకుండా ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు నా మధ్య ఎలాంటి అరమరికలు, విభేదాలు లేవు. పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు.
AP Local War Siren : పిచ్చి లిక్కర్ తో దోచారు

గత ప్రభుత్వం నాసికరం మద్యం అమ్మకాలతో రూ. 23 వేల కోట్లు దోచుకుంటే .. మా ప్రభుత్వం ఆ దోపిడీని అరికట్టి రూ. 10 వేల కోట్లు తల్లికి వందనం పథకానికి ఖర్చు చేశాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 4 కోట్ల భోజనాలు అందించాము.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున 2.90 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 436 కోట్లు వారి ఖాతాల్లో వేశాం. జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే … కూటమి పాలనలో కేంద్రాన్ని మళ్ళీ ఒప్పించి రూ. 24 వేల కోట్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం, అని డిప్యూటీ సీఎం వివరించారు.
AP Local War Siren : పొలాల్లో సీఎం హల్ చల్
మీ భూమి, మీ హక్కు పేరిట రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి చేరుకున్నారు.

అక్కడి రైతులతో ముఖాముఖీ పంచుకున్నారు. ఎస్పీఎఫ్ బలగం వలయంలో నడిచే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తానే ఓ ఊరి కుర్రోడిగా మారిపోయారు. పంటకాలువ బోదెపై తాటి పట్టాను.. సిమెంటు స్థంభాన్ని దాటుకుంటూ పోలాలను పరిశీలించారు. ఓ పక్క నిటారు కొబ్బరి చెట్లు, మరో వైపు మండుటెండను సైతం లెక్క చేయలేదు. రాయవరం రైతులో మాట్లాడుతూ.. రైతుల స్థితి గతిని వివరించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిసన్ కు వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ దిగింది మొదలు.. అధికారులు, ప్రజాప్రతినిధుల స్వాగతాలను స్వీకరిస్తూనే.. జనంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గత పాలకుల అక్రమాలపై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా ప్రజావేదికపై మాట్లాడుతూ, కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నారు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదు. అలాంటి రైతులకు చెందిన భూ పత్రాల విషయంలో గత పాలకులు పాస్ పుస్తకాల జారీకి సంబంధించి అక్రమాలు చేశారు. గత పాలకుల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించాను. కానీ వారి అహంకారం నెత్తికెక్కి మీ ఆస్తులపై ఆయన ఫోటో వేసుకున్నారు. పూర్వీకులు ఆర్జించిన భూమిపై నాటి పాలకుని ఫోటో ఏమిటి.? సరిహద్దు రాళ్లపై గత పాలకుని ముద్రలేమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టాన్ని తెచ్చి వాళ్లకు నచ్చిన వాళ్ల ఆధీనంలోకి తీసుకువచ్చేలా చేశారు.
దీనిని గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించాను. మీ భూముల వివరాలన్నీ గత పాలకుల అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజల భూములన్నీ కాజేసేందుకు కుట్రపన్నారు. నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు. రైతుల భుంలపై వేరేవాళ్ల ఫోటోలెందుకని ప్రశ్నించాను.
ప్రభుత్వంలోకి వచ్చాం… రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. గత పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రెండో సంతకమే పెట్టాను. భూమి అనేది రైతుకు ఆస్తి మాత్రమే కాదు ఓ విశ్వాసం, కుటుంబంతో కలిసిపోయిన సెంటిమెంట్. గతంలో భూమి ఇవ్వకపోతే దానిని 22 ఏ రికార్డుల్లో పెట్టేశారు. అందుకే ప్రజలు ఆలోచించి సమయం వచ్చినప్పుడు చూద్దామని బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు. అని సీఎం చంద్రబాబు వివరించారు.
AP Local War Siren : ఇది ఒక యజ్ఞం
ఓ యజ్ఞం తరహాలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు అందించాలని కోరుతున్నాం. జారీ అయిన పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లితే నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ప్రభుత్వం ఉన్నదే వివాదాలు పరిష్కరించడానికి. గత పాలకుడు రూ.660 కోట్ల సర్వే రాళ్లపై బొమ్మలు ముద్రించడానికి ఖర్చు పెట్టాడు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకోడానికి రూ.22 కోట్లు ఖర్చు చేశారు. 77 లక్షల సర్వే రాళ్లపై అతని ఫోటో వేయించుకున్నారు. వాటన్నిటినీ సరి చేయించాం. ఆర్వోఆర్, ఎఫ్ లైన్ లాంటి రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం.
AP Local War Siren : 22ఏ జాబితాను సవరిస్తాం
బలవంతంగా 22ఏ జాబితాలో పెట్టేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నాం. భూయజమానులకు ప్రయోజనం కల్పించేలా నాలా చట్టాన్ని రద్దు చేశాం. జాయింట్ కలెక్టర్ల వద్ద మాత్రమే ఉండిపోయిన కొన్ని అధికారాలను వికేంద్రీకరించాం. గతంలో కొందరు స్వార్ధంతో, లాలూచీ రాజకీయాలతో భూములు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మళ్లీ రీసర్వే చేసి 6688 గ్రామాల్లో గ్రామసభలు కూడా నిర్వహించాం. వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.

సబ్ డివిజన్ ఫీజు కూడా మాఫీ చేశాం. కుటుంబాల మధ్య తగాదాలతో ఆస్తుల వివాదాలు తలెత్తుతున్నాయి.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటు రాయవరంలో సీఎం చంద్రబాబు, అటు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని పరిశీలిస్తే.. అతి త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్టు సిగ్నల్స్ అందుతున్నాయి. వైసీపీని మాగ్జిమం ఊళ్లల్లో నిర్వీర్యం చేసే వ్యూహంతో..కూటమి నేతలు యుద్ధాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా ఇద్దరు నాయకుల మధ్య సమన్వయంతో.. గ్రామాల్లో పునాదులు వేసుకోవటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
click here to read ఇక ఏసీ ‘పల్లె వెలుగు’లు
కూల్చివేతకు గురైన బాధితులకు( Victims) అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నవంబర్ 27న ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 లక్ష చొప్పున ( ₹1 Lakh)తన వ్యక్తిగత నిధుల నుండి మొత్తం ₹39 లక్షలు (₹39 Lakhs) పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇప్పటం వృద్ధురాలు నాగేశ్వరమ్మను కలిసి, “మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ వస్తాను” అని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చారు.
కూల్చివేతకు గురైన బాధితులకు( Victims) అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నవంబర్ 27న ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 లక్ష చొప్పున ( ₹1 Lakh)తన వ్యక్తిగత నిధుల నుండి మొత్తం ₹39 లక్షలు (₹39 Lakhs) పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇప్పటం వృద్ధురాలు నాగేశ్వరమ్మను కలిసి, “మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ వస్తాను” అని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చారు.
