Court | లైంగిక దాడి కేసులో…

Court | లైంగిక దాడి కేసులో…
- నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష…
Court | మేడ్చల్, ఆంధ్రప్రభ : 2017లో దుండిగల్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన టీ.నర్సింహారెడ్డి అనే వ్యక్తి వాచ్‌మన్ కూతురైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మేడ్చల్ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను స్పెషల్ పీపీ ప్రభాకర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. పోక్సో చట్టం ప్రకారం మేడ్చల్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి నరసింహ రెడ్డి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు.
ఈ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో నమోదు కాగా, బాధితురాలికి భరోసా సెంటర్ (Center) లీగల్ అడ్వకేట్ రోజా సహకారంతో న్యాయ సహాయం అందించబడింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితుడిపై శిక్ష ఖరారు చేసింది.
