TG | ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి.. సంక్షేమం..

TG | ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి.. సంక్షేమం..
మంత్రి పొంగులేటి
TG | ఇల్లెందు, ఆంద్రప్రభ : ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి సంక్షేమమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇల్లెందు పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంత లేకపోయినా సంక్షేమాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అభివృద్ధే కొలమానంగా చేసుకొని ముందుకు సాగుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేస్తుందని, ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, సర్పంచులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ లు డి వెంకటేశ్వరావు, అనసూయ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, దొడ్డడానియల్, పులి సైదులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
