Chennur | 30క్వింటాళ్ల‌ రేషన్ బియ్యం పట్టివేత

Chennur | 30క్వింటాళ్ల‌ రేషన్ బియ్యం పట్టివేత

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం 63వ జాతీయ రహదారి గుండా మహారాష్ట్రకు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 30క్వింటాళ్ల‌ రేషన్ బియ్యన్ని పట్టుకున్నట్లు చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం… జాతీయ రహదారిగుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పౌరసరఫరా రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా అంతర్రాష్ట్ర వంతెన వద్ద‌ కోటపెల్లి పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి గుండా అక్రమ దందాలు కొనసాగిస్తే చట్టరీత్యా చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

Leave a Reply