మోడీపై యుద్ధం

మోడీపై యుద్ధం
క్షమాపణలు చెప్పే వరకు వదలం
నరేగా చట్ట సవరణ వెనక్కి తీసుకునే దాకా పోరాటం
పేదల కడుపు మంటలో ప్రధాని మోడీ భస్మం కాక తప్పదు
గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తాం.. అడుగడుగునా నిలదీస్తాం
ఉమ్మడి జిల్లాలవారీగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు
మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రారంభం
ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు ఆహ్వానం
ఒక్కో సభకు కనీసం లక్ష మంది జనసమీకరణ మంత్రి పొంగులేటికి కీలక బాధ్యతలు..
భట్టి విక్రమార్కకు పర్యవేక్షణ బాధ్యతలు
టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ మానస పుత్రిక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) పథకాన్ని పునరుద్దరించే వరకూ ఉద్యమ స్పూర్తితో పోరాడుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని పారంభించిన తెలంగాణ గడ్డ నుంచే… మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీగా మోడీపై యుద్ధం మొదలు పెడతామని, క్షమాపణ చెప్పే వరకూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘నరేగా’ చట్ట సవరణ ఉపసంహ రించుకునే దాకా తమ పోరాటం ఆగదని, ఆ దిశగా కేడర్ అంతా
