Died | బావిలో పడి బాలుడు మృతి…

Died | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో చిన్నారి బావిలో పడిన సంఘటన జరిగింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాడు. రేగిపండ్ల కోసం వెళ్లిన టీ. రఘురాం అనే ఎనిమిదేళ్ల బాలుడు కాలుజారి బావిలో పడ్డాడు.
ఇతను చదువుకుంటూ సెలవులకు అని ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇంట్లోనూ తెలిసిన వారి ఇంట్లోనూ తోటి పిల్లలను విచారించారు. అయితే ఇవాళ వెతకగా బావిలో మృతదేహాన్ని గుర్తించారు. బాలుడు బంధువుల తల్లిదండ్రులు రోధనలు హృదయ విదారకంగా మారాయి. సిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
