Visakha | విశ్వవిద్యాలయాలు ప్రగతి లో విద్యార్థులు పాత్ర ప్రశంసనీయం

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం – దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల ప్రగతిలో విద్యార్థుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు కొనియాడారు. ఏయూ తెలుగు విభాగంలో తాజాగా సెమినార్ హాల్ ను ఆధునీకరించారు. దీంతో శుక్రవారం ఆ సెమినార్ హాల్ ను ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ. తాము 30 ఏళ్ళ కిందట విధుల్లో చేరినప్పుడు ఆర్ట్స్ కలశాలలు లో అంతంత మాత్రమే సదుపాయాలు ఉండేవన్నారు. ఒక దశలో ఆర్ట్స్ కళాశాలలు అంటే అప్పట్లో చిన్న చూపుగా ఉండేవన్నారు. అయితే క్రమేపి ఆ భావన పోయి నేడు నాక్ ర్యాంక్ లలో సైతం ఆర్ట్స్ కళాశాలలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు అలాగే పరిశోధకులు, ఆచార్యులు అందిస్తున్న సహాయ సహకారాలు ప్రసంసనీయం అన్నారు.

అలాగే తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు తమ ఇళ్ళలో మాదిరిగానే అందమైన రంగులు వేసి ఎంతో బాగా ఆధునీకరించడంలో విద్యార్థుల కష్టం మరువ లేనిదన్నారు.. తన పరిధి మేరకు ఆర్ట్స్ కళాశాల అన్ని విభాగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయని, కాబట్టి విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో ఉన్నత విద్యాభ్యాసం సాగించి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు నేడు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.

తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఈ విభాగాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. ఇందుకు సహకరించిన వర్సిటీ పెద్దలతో పాటు పరిశోధకులు, పూర్వ విద్యార్థులు అందించిన సహకారం మరువలేనిదన్నారు… ఇతర విభాగాలకి తెలుగు విభాగం ఆదర్శప్రాయం కావాలన్నదే తన లక్ష్యం అన్నారు… తెలుగు విభాగం విద్యార్థులు నేడు ఎంతో ప్రతిభ పాటవాలు ప్రదర్శించి ఉన్నత స్థాయీ అవకాసాలు అంది పుచ్చు కుంటున్నాయన్నారు..ఈ

సందర్బంగా విద్యార్ధులు తరపున ప్రిన్సిపాల్ తో పాటు శాఖ అధ్యక్షులు జెర్రా అప్పారావు ను ద్వితీయ సంవత్సరం విద్యార్థి గంట్ల శ్రీను బాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో తెలుగు విభాగం ఆచార్యులు గజ్జ యోహాను బాబు, వెంకటేశ్వర్లు యోగి, ఎ. ఈశ్వరమ్మ, కట్టెపోగు రత్న శేఖర్, పెండ్యాల లావణ్య, పరిశోదక విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply