Fire accident | ఓ అగ్ని దేవుడా.. నా నీడనే మింగేవేమయ్యా…

Fire accident | ఓ అగ్ని దేవుడా.. నా నీడనే మింగేవేమయ్యా…
- కూలి చేస్తూనే కడుపు నిండేదయ్య
- ఇప్పుడు ఏ నీడలో బతకాలయ్యా…
- కాలి బూడిదైన చోటే రోధిస్తున్న దంపతులు
- అందరినీ కంటతడి పెడుతున్న అదృశ్యం
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
- తోచిన సహాయం చేస్తున్న ఊరి ప్రజలు
Fire accident | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఓ అగ్నిదేవుడా.. నా నీడనే మింగావేమయ్యా.. మేము కూలి చేస్తేనే కడుపు నిండుతది ఇప్పుడు ఏ నీడలో బతకాలయ్యా..’ అంటూ ధార శంకర్ పద్మఅనే దంపతులు తన ఇల్లు కాలిబూడిదయిన చోటే పడుకుని రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అగ్నిప్రమాదం(fire)లో ఇల్లు కాలిపోవడంతో డొక్కలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఇది భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామంలో ఇటీవలకాలి బూడిదైన గుడిసె మొండి గోడలు దగ్ధమైన ధాన్యం బాధితుల రోజున దృశ్యం ఆ ఊరి ప్రజలకు కన్నీరు పెట్టిస్తుంది కళ్ళముందే గుడిసె ఆహుతి అవుతుంటే గుండెల వేసేలా రోదిస్తున్నారు ప్రాణ నష్టం సంభవించకపోవడం పోరాటానిచ్చిన ఇల్లు పూర్తిగా ఖాళీ సర్వం కోల్పోయి బాధితులు కన్నీటి పర్యటమవుతున్నారు.
ఇంట్లో బియ్యం(rice) బట్టలు నగదు బంగారం కాలి బూడిద అయ్యాయి కట్టు బట్టలతో మిగలమని ఆవేదన చెందుతున్నారు. మా బతుకులు అగ్గిపాలయ్యాయని ఇల్లు కాలి బూడిద కావడంతో సర్వం కోల్పోయాం మంటలు చెలరేగుతున్న సమయంలో ఏమి చేయాలో తోచలేదు రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాం ప్రభుత్వం ఆదుకొని ఇల్లు కట్టించాలి అని కోరుతున్నాం.
ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది.. (ధార శంకర్ పద్మ)

సాటి మనిషి కష్టాల్లోఉన్నపుడు తోచినంత సహాయం అందిస్తే అదే బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. ధార శంకర్ పద్మ యొక్క ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయి ఛిన్నాభిన్నం అయింది అలాంటప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులకు తోటి సమాజమే ఆపన్నహస్తం అందించి కష్టాల్లో మేమున్నాం అంటూ… వేలం పల్లి గ్రామస్తులుమాట సహాయంతో పాటు ఆ బాధిత కుటుంబానికి వస్త్రాలు, నగదు బియ్యం తదితర సామాగ్రి ఇస్తూ ఆదుకుంటున్నారు. సమస్యలు పంచుకుంటూ.. ఉన్న ఊరే కన్నతల్లిలా కష్టాల్లో ఉన్న వారిని తలోచేయి వేసి ఆదుకుంటున్నారు. దీంతో బాధిత కుటుంబం ఊరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
