AP CM | పోల‌వ‌రం ప‌నుల‌పై ఆరా

AP CM | పోల‌వ‌రం ప‌నుల‌పై ఆరా

  • ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్ర‌బాబు

AP CM | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సీఎం నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ లోని పలు విభాగాలలో పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ రోజు ఉదయం పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ (Project) పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుంచి పనుల ప్రగతిని పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సూపరింటెండెండింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, తదితరులు ముఖ్యమంత్రికి ప్రాజెక్ట్ పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు.

AP CM

AP CM | అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌

అనంతరం అప్పర్ కాఫర్ డ్యాం చేరుకొని, అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాప్ – 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, కుడి ప్రధాన కాలువ కనెక్టువిటీస్ చేరుకొని అక్కడ పనుల (Work) పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ల‌ను పరిశీలించి, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైబ్రో కంప్యాక్షన్ చేరుకొని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

AP CM


సీఎం (CM) వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రులు డా. నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారధి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఎంపీ మహేష్ యాదవ్ , శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, డా. కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్, పితాని సత్యనారాయణ, ఏలూరు రేంజి ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, ఏపీ ఏఎస్ సీపీసీ చైర్మన్ పీతల సుజాత, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.

AP CM

CLICK HERE TO READ విద్యాభివృద్ధికి కృషి చేయ

CLICK HERE TO READ MORE

Leave a Reply