Kamareddy | కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత….

కామారెడ్డి జిల్లాలో సంఘ‌ట‌న‌
తొలుత 15 మంది అస్వ‌స్థ‌త‌
త‌ర్వాత పెరిగిన సంఖ్య‌
బాన్సువాడ‌, నిజామాబాద్ జిల్లాల్లో వైద్య సేవ‌లు

కామారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ : కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపింది. సోమ‌వారం క‌ల్తీ క‌ల్లు తాగి తొలుత 15 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. నస్రుల్లా బాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన బాధితులు అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుండడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి కల్లు బాధితులను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సను ప్రారంభించారు.

58కి చేరిన అస్వ‌స్థ‌తుల సంఖ్య‌
కల్తీ కల్లు బాధితులు ప్ర‌స్తుతానికి 58కి చేరింది. బాధితుల్లో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. కల్తీ కల్లు ఘటనతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లి ఆరా తీశారు. ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాల్లో శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. కల్లు దుకాణాల లైసెన్స్ లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply