Collector | హెల్మెట్ ప్రాణ రక్షణకు తొలి మెట్టు

Collector | హెల్మెట్ ప్రాణ రక్షణకు తొలి మెట్టు

  • జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్
  • పుట్టపర్తిలో జాతీయ రహదారుల భద్రత వారోత్సవాల ర్యాలీ
  • హాజరైన హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి

Collector | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : హెల్మెట్ ధరించడం అనేది ప్రాణరక్షణకు మొదటి మెట్టుగా భావించవచ్చనని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ భద్రత ఉరోత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం స్థానిక సత్యమ్మ గుడి వద్ద నుంచి “జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల ర్యాలీష‌ని క‌లెక్ట‌ర్‌, ఎస్పీ ఎస్‌.స‌తీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు మొదటి అడుగు.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. ప్రమాద సమయంలో తల గాయాల నుంచి రక్షణ కల్పించేది ఒక్క హెల్మెట్ మాత్రమేనన్నారు. డ్రైవర్ మాత్రమే కాదు, వెనుక కూర్చునే ప్రయాణికుడూ హెల్మెట్ తప్పనిసరి ధ‌రించాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం. జరిమానా విధించబడుతుందన్నారు. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ప్రతీ ప్రయాణంలో హెల్మెట్ తప్పక ధరించండి.** అని పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీ స్థానిక సత్యమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం గణేష్ గేట్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. జిల్లా రవాణా అధికారి కరుణ సాగర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేశులు, రవాణా శాఖ ఎంవీఐలు, స్థానిక ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply