100 years | సీపీఐకి వందేళ్లు..

100 years | సీపీఐకి వందేళ్లు..

  • జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

100 years | రామన్నపేట, ఆంధ్రప్రభ : రామన్నపేట మండల కేంద్రంలోని సీపీఐ మండల కమిటీ సమావేశం రచ్చ యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని, దేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం(Independence) కావాలని తొలుత కోరిన పార్టీ సీపీఐ అని, 2025 డిసెంబర్ 26తో పార్టీ 100 సంవత్సరాలు(100 years) పూర్తి చేసుకుంద‌న్నారు.

బ్రిటిష్ వారిపై మన దేశానికి స్వాతంత్ర్యం కావాలని, రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారన్నారు. కాన్పూరు, పెషావర్‌లలో కుట్ర కేసులు పెట్టి నాయకులను జైలులో నిర్బంధించారని, అయినప్పటికీ విద్యార్థి యువజన కార్మిక రైతు మహిళ తదితర ప్రజా సంఘాలు నిర్మించి వెట్టిచాకిరి విముక్తి కొరకు కార్మికులు కర్షకులకు జరుగుతున్న దోపిడీని విముక్తి చేయడానికి అనేక పోరాటాలు సీపీఐ నిర్వహించింద‌న్నారు.

సీపీఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలో జరిగే భారీ బహిరంగ సభ ఒక మార్పున‌కు సూచనగా మారబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ, జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్(Erra Ramesh Goud), మండల సహాయ కార్యదర్శి రామచంద్రం, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, వార్డు సభ్యురాలు భారతమ్మ, గంగాపురం వెంకటయ్య, గంగాపురం యాదయ్య, వీరమల్ల ముత్తయ్య, సంగిశెట్టి పాండు, ఊట్కూరు కృష్ణ, ఏనూతుల రమేష్, మీసం గాలయ్య, సీహెచ్ మల్లయ్య, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply