Adilabad bandh | సోయా కొనుగోళ్ల చేయాలని డిమాండ్

Adilabad bandh | సోయా కొనుగోళ్ల చేయాలని డిమాండ్

  • బిఆర్ఎస్ పోరుబాట.. మాజీ మంత్రి జోగు రామన్న సహా నేతల అరెస్ట్..

Adilabad bandh | ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : సోయా పంటను భేషరతుగా కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు అదిలాబాద్ బంద్ (Bandh) ప్రశాంతంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారు జామునే మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు అదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. బస్సులను కదలనివ్వకుండా అడ్డుకున్నారు.

Adilabad bandh | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, పంట కొనుగోలు చేపట్టకుండా రైతులను (Farmer) మోసగిస్తున్నాయని మాజీ మంత్రి రామన్న ఆరోపించారు.

Adilabad bandh

Adilabad bandh | పోలీసులు రంగంలోకి దిగి…

ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి బస్సులను (Busses) అడ్డుకున్న మాజీ మంత్రి రామన్నతో సహా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. వారిని మావల, రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రెండు గంటల పాటు బస్సులు నిలిచిపోగా ఆ తర్వాత పోలీసు బందోబస్తు సహాయంతో బస్సులను బయటకు పంపించారు.

Adilabad bandh | ఆదిలాబాదులో దుకాణాలు బంద్..!

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన ఉదృత రూపం దాల్చింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి సోయాబీలు కొనుగోలు చేపట్టాలని, రైతులకు భరోసా సాయం అందించాలని డిమాండ్ (Demand) చేశారు. జిల్లాలో దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. పెట్రోల్ బంకులను కూడా పనిచేయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మాత్రం యధావిధిగా పని చేశాయి. మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, పార్టీ నేతలు యూనుస్ అక్బాని, విజ్జగిరి నారాయణ, లింగారెడ్డి, సాజిద్, జంగిలి ప్రశాంత్, లింగారెడ్డి, ఆడప తిరుపతి, మాశెట్టి గోవర్ధన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. పోలీసులు అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు.

Adilabad bandh

CLICK HERE TO READ ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply