Global warming | వరిలో తడి -పొడి సాగు పై రైతులకు అవగాహన

Global warming | వరిలో తడి -పొడి సాగు పై రైతులకు అవగాహన
Global warming | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం కారేపల్లి గ్రామంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారి ఆధ్వర్యంలో ఈ రోజు తడి-పొడి సాగుపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుస్థిర వ్యవసాయ కేంద్ర జూనియర్ అగ్రోనామిస్ట్ భార్గవ్ మాట్లాడుతూ… వరిలో నీటిని ఆదా చేసుకునే పద్ధతులను రైతులు అమలు చేసుకోవాలని వరిలో కలుపుకు తొలగించిన తర్వాత పొట్ట దశ వచ్చే సమయం వరకు ఎక్కువ నీరు అవసరం ఉండదని కేవలం 45 తడులతో తడి-పొడి విధానం పాటించి సాగు చేయవచ్చు అని సూచించారు.
నీరు వృధా కాకుండా యాసంగిలో పంట చివరి దశ వరకు పొలాలకు సాగు నీరు అందించవచ్చు ఈ విధానంలో 30 సెంటీమీటర్ల ఎడబ్ల్యుడీ పైపును 15 సెంటీమీటర్ల(15 cm) వరకు రెండు సెంటీమీటర్ల ఎడంలో రంద్రాలు చేసుకొని జల్లెడ మాదిరి తయారు చేసుకుని దీన్ని పొలం గట్టు నుంచి మీటర్ దూరంలో రంధ్రాలు భూమికి సమాంతరంగా మునిగిపోయేలా అమర్చుకోవాలి అన్నారు.
భూ ఉపరితలం నుంచి ఐదు సెంటీమీటర్ ల వరకు నీరు కిందకు పడిపోయినప్పుడు ఐదు సెంటీమీటర్ల మాత్రమే నీటిని అందించాలని రైతులకు సూచించారు. ఈ పద్ధతి పాటిస్తే నీటి వృధాను అరికట్టడంతో పాటు వరి పంట నుండి వెలువడే మీథేన్ వాయు వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్(Global warming) ని తగ్గించి మనకు తెలియజేయకుండానే పర్యావరణ కాపాడుకోవడంతో పాటు 15 నుంచి 30% దిగుబడి సాధించవచ్చుక్షేత్రస్థాయిలో అవగాహనతో పాటు రైతులకు ఏడబ్ల్యూడి (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండీ డ్రయింగ్) పైపులు ఉచితంగా అందజేశారు.
ఈ పద్ధతి పాటించడం ద్వారా దోమపోటును నివారించవచ్చు, సరైన గాలి వెళ్తురు మొక్కకు అంది పిలకల శాతం పెరుగును దీని ద్వారా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వేరు వ్యవస్థ బలంగా ఏర్పడుతుంది ఇట్టి కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్ర సిఆర్పి నోముల మహేందర్,గ్రామ రైతులు పాల్గొన్నారు.
